Somu Veerraju: ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పని చేయాలనుకుంటోందా..?
ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పని చేయాలనుకుంటోందా అని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పీఆర్సీ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం పని చేయలేదన్న సోము.రాష్ట్రంలో ఇళ్లకు పన్నులు పెంచిహెచ్‌ఆర్ఏ తగ్గించారన్నారు. ఏ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్న సోము వీర్రాజు.ఉద్యోగుల తరపున బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.