Subbarao Gupta: సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండించిన కడపజిల్లా ఆర్యవైశ్య సంఘం

ప్రకాశం జిల్లా కు చెందిన సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని  కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం తీవ్రంగా ఖండించింది. కడప నగరంలోని మండి బజార్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పడచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడైన రౌడీ షీటర్ సుభానీ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఉన్నత విలువలను సంపాదించుకున్న ఆర్యవైశ్యులను అణదొక్కాలని చూస్తే సహించబోమని, ఉన్నతస్థాయి కి ఎదుగుతున్న తరుణంలో దాడులతో అణిచి వేయాలనుకోవడం అవివేకమే అన్నారు. బాలినేని పుట్టినరోజు వేడుకల్లో కోన్ని సూచనలు చేసిన సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. లాడ్జీలో ఉన్న గుప్తాపై రౌడీ షీటర్ సుభానీ దాడి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏమి సంకేతాలు ఇస్తున్నారన్నారని మండిపడ్డారు. ఇలా పైశాచిక ఆనందం పోందడం తగదని, ఆర్యవైశ్యులకు మీరిచ్చే గౌరవం  ఇదేనానని నిలదీశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola