Srikakulam Police: శ్రీకాకుళం జిల్లాలో క్రెడిట్ కార్డ్ మోసాల నెట్వర్క్ ను చేధించిన పోలీసులు
శ్రీకాకుళం జిల్లా లో జరిగిన క్రెడిట్ కార్డు మోసాలకు పాలకొండ పోలీసులు చెక్ పెట్టారు.ఈ ఘటనలో 30 లక్షల వరకు నష్టపోయిన బాధితులు కుటుంబాలు ఉన్నట్లు పోలీసులు తెలుపరు. ఈ ఘరానా మోసగాడిని బట్ట బయిలు చేసినట్లు డియస్ పి శ్రావణి తెలిపిన వివరాలు ఈ మోసగాడు .పాలకొండ యస్ బి ఐ క్రెడిట్ కార్డు అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా గత కొంత కాలం పనిచేసాడు. ఈయన కొత్తూరు మండలం కుంటిబద్ర గ్రామ నికి చెందిన అగతముడి రాజేశ్ కుమార్. ఇతను క్రెడిట్ కార్డు కంపెనీ లో బోయ్ గా పనిచేసేవాడు . జల్సాలకు అలవాటుపడి 30 లక్షల వరకు ఘరానా మోసం చేసినట్లు డిఎస్పీ తెలిపేరు. ఘరానా మోసం గాడిపై ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీగలాగితే డొంక కదిలింది. ఈ ఘరానా మోసంపట్టుకోవడానికి ప్రయత్నించిన సిఐ శంకర్ రావు ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది శ్రీదేవి పుష్పాలను అభినందించారు ఈయన క్రెడిట్ కార్డ్ లను ఈయన ఎక్కువగా పెట్రోల్ బంకుల్లో ఉపయోగించేవారని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని 35 వేల నగదు,పది క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు