Srikakulam JC: పాడైన, తడిసిన ప్రతీ ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామనీ.. ఎవరు కూడా దళారీలను ఆశ్రయించవద్దని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ విజయసునీత కోరారు. అన్నదాతలు ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఆమె కోరారు. ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన జేసీ... వ్యవసాయ పరిశ్రమగా ముద్రపడిన శ్రీకాకుళం జిల్లా లో ధాన్యం విక్రయించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొవటానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం ఏవిధమైనా సాయమైనా అందిస్తుందన్న జేసీ..రైతు భరోసా కేంద్రాలుతో రైతులు పొందే ఉపయోగాలు చాలా ఉన్నాయన్నారు.