Srikakulam జిల్లాలో ఉద్యమానికి సిద్ధం అంటున్న ఎమ్మెల్సీ వర్మ తో F2F
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి జీవోలను వెనక్కి తీసుకోవాలని లేదంటేనిరవధిక నిరాహార దీక్షలు ఆందోళనకి సిద్ధమవుతున్నారు ఉద్యోగులు. పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ, మరొక నాలుగు రోజులపాటు శాంతియుత ధర్నాలకు పిలుపునిస్తున్నారు. ఒకటో తారీఖున జీతాల్లో తేడా వస్తే ప్రభుత్వానికి ఉద్యోగస్తులు ఉద్యమం ఎలా ఉంటాదో చూపిస్తాం అంటున్నారు. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమానికి సిద్ధంగా వున్నారంటున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ వర్మ తో మా ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.