AP New Districts : కొత్త జిల్లాల నిర్ణయంపై కొనసాగుతున్న నిరసనలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.... నరసాపురం JAC నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చింది. వ్యాపారులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బస్టాండ్ ముందు ఆందోళన చేసిన నాయకులు.... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు ఆందోళన చేసిన తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.