ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీ కి దొరికిపోయిన సర్వేయర్..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మండల సర్వేయర్ హేమ సుందర్ ఓ మహిళా రైతు నుంచి 1.4 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మండల కేంద్రానికి చెందిన ఎన్.జయమ్మ అనే మహిళ నుంచి కళ్యాణదుర్గం మండలంలో నలభై సెంట్లు భూమి సబ్ డివిజన్ చేయడానికి రెండు లక్షల లంచం డిమాండ్ చేసినట్లు 1.5 లక్షల కు ఒప్పందం కుదుర్చుకొని 10 వేలు మిగిలిన మొత్తం ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా కర్నూలు రేంజ్ డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు