Dimple Hayathi Green Challenge : గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగం గా మొక్కలు నాటిన హీరోయిన్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జి హెచ్ ఎం సి పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి డింపుల్ హయతి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం గా మొక్కలు నాటాలని కోరారు.అనంతరం హీరో రవితేజ,డైరెక్టర్ రమేష్ వర్మ,సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్,నటి మీనాక్షి చౌదరి కి గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు డింపుల్ హాయతి.