Spring Biryani: అనంతపురంలోని ఓ పూరి గుడిసెలో స్ప్రింగ్ బిర్యాని టేస్ట్ అదుర్స్
Continues below advertisement
స్ప్రింగ్ బిర్యాని అనగానే ఏదో ఇంగ్లీష్ వంటకం అనుకునేరు కాదండి ఇది అచ్చమైన మన రాయలసీమ రెసిపీ ఉగ్గాని. సీమవాసులకు ఎంతో ప్రత్యేకమైన ఉగ్గానిని ముద్దుగా స్ప్రింగ్ బిర్యాని అని పిలుచుకుంటారు. అయితే రాయలసీమలో ఎక్కడపడితే అక్కడే దొరికేదే అయినా అనంతపురం పట్టణంలోని రామచంద్రనగర్ రైల్వే గేటు పక్కనే ఉన్న ఓ చిన్నపాటి పూరిగుడిసెలో ఉండే ఉగ్గాని, వడలు అంటే ప్రజలు క్యూ కడతారట. ఈ హోటల్ ప్రత్యేకతేంటి? అసలు ఉగ్గాని ఎలా తయారుచేస్తారు?
Continues below advertisement