Space X Rocket: అంతరిక్షంలో మార్చి నాలుగో తారీఖున ఏం జరగనుంది..?

చందమామను ఓ రాకెట్ శకలం వేగంగా ఢీకొట్టనుంది. ఏదో పరీక్షల కోసమో...లేదా నీటి జాడలు కనుగొనటానికో కాదు....ఇంధనం పూర్తవటంతో ఈ రాకెట్ శకలం చంద్రుడిపై పడిపోనుంది. స్పేస్ ఎక్స్ 2015లో అంతరిక్ష ప్రయోగాల కోసం ఫాల్కన్ 9 ను ప్రయోగించింది. అప్పటి నుంచి రాకెట్ బూస్టర్ ఇంధనాన్ని వినియోగించుకుంటూ మిషన్ లో పాల్గొంది. అయితే ఇప్పుడు మిషన్ పూర్తవటంతో...ఫాల్కన్ బూస్టర్ ను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఇంధనం లేకపోవటంతో...చంద్రుడిపై క్రాష్ చేయాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. మార్చి 4న చంద్రుడి ఉపరితలాన్ని ఫాల్కన్ 9 బూస్టర్ నేరుగా ఢీకొట్టనుంది. నాలుగు టన్నుల బరువుండే ఫాల్కన్ 9 బూస్టర్ ఢీకొనటంతో చంద్రుడిపై ఓ పెద్ద గొయ్యి ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola