Space : విచిత్రమైన స్పిన్నింగ్ వస్తువు ను గుర్తించిన ఆస్ట్రేలియా ఆస్ట్రానమీ రీసెర్చ్ పరిశోధకులు
ఆస్ట్రేలియాలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రీసెర్చ్ పరిశోధకులు గంటకు మూడుసార్లు లేదా ప్రతి 18.18 నిమిషాలకు ఒక విచిత్రమైన స్పిన్నింగ్ వస్తువును అంతరిక్షం లో కనుగొన్నారు. "ఇది ఖగోళ శాస్త్రవేత్తలు ఇంతకు ముందు చూసిన వాటికి భిన్నంగా ఉంది" అని ICRAR తెలిపింది. పాలపుంతలో ఉన్న ఈ వస్తువు ను పరిశోధకులు విశ్వంలో రేడియో తరంగాలను మ్యాపింగ్ చేస్తున్నప్పుడు కనుగొన్నారని చెప్పారు.ఆస్ట్రేలియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఖచ్చితమైన వ్యవధిలో శక్తిని విడుదల చేసే "స్పిన్నింగ్ వస్తువు"ని కనుగొన్నారు. ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదని పరిశోధకులు చెప్పారు.