SP Vishal Gunny : సామూహిక అత్యాచార కేసును ఛేదించిన పోలీసులు
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు వద్ద జంటపై సామూహిక అత్యాచార కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తు వివరాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 8 మంది సభ్యుల ముఠా ఈ దారుణానికి పాల్పడ్డట్టు తెలిపారు. ఆరుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు. నిందితులు 2-3 రోజులు ముందుగానే రెక్కీ నిర్వహించి... దారి దోపిడీలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడతారని ఎస్పీ వివరించారు. పగలు కూలీ పనులు చేసుకుని రాత్రి పూట నేరాలకు పాల్పడతారన్నారు. మొబైల్స్, ద్విచక్రవాహనాలు అస్సలు వాడరన్నారు.