Siricilla talent: సిరిసిల్ల చేనేత కార్మికుల హస్త కళా నైపుణ్యం
సిరిసిల్ల చేనేత కళాకారుల హస్త కళా నైపుణ్యానికి సరికొత్తగా పరిచయం అవసరం లేదు. అగ్గిపెట్టె, ఉంగరం, సూదిలో పట్టే చీరలను తయారు చేయడంలో వారిది అందెవేసిన చేయి. అయితే ఇంతకుముందు ఇవన్నీ ప్రదర్శన కోసమే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కట్టుకోవాలంటే మాత్రం కుదిరేది కాదు. పట్టణానికి చెందిన హరిప్రసాద్ వినూత్నంగా ఆలోచించి ఒక గ్రాము గోల్డ్ తో, 350 గ్రాముల బరువున్న చీర అగ్గిపెట్టెలో పట్టేలా తయారు చేయడమే కాక దాన్నీ కట్టుకునే వీలును కల్పించారు. విదేశాలకూ ఇది ఎగుమతి అవుతోందని హరిప్రసాద్ తెలిపారు.