Siddharth Apologises Saina: అది చాలా బ్యాడ్ జోక్
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌కు సారీ చెబుతూ హీరో సిద్ధార్థ్ ఓ లేఖ విడుదల చేశారు. అందులో తనది బ్యాడ్ జోక్ అని అంగీకరించారు. అయితే... తనపై వచ్చిన విమర్శల విషయంలో ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు. తన ట్వీట్‌లో లింగవివక్ష లేదని ఆయన మరోసారి వివరించారు. రెండు రోజుల క్రితం.. మోదీ పంజాబ్ పర్యటనపై అసహనం వ్యక్తం చేస్తూ సైనా నెహ్వాల్ ఓ ట్వీట్ చేశారు. దానికి ప్రతిస్పందనగా సిద్ధార్ధ్ చేసిన ట్వీట్‌లో ఉన్నది జోక్ అని చెప్పిన సిద్ధార్థ్... అందరూ విమర్శిస్తున్నట్టు అందులో హానికరమైన ఉద్దేశం లేదని చెప్పారు. ముఖ్యంగా 'కాక్' అనే పదాన్ని సిద్ధార్థ్ ఉపయోగించడం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు.