Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్' ట్రైలర్ విడుదల
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ వచ్చేసింది. తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ భాషల్లో ట్రైలర్ రిలీజైంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా కనిపిస్తున్న ఈ చిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. సినిమాల్లో అవకాశాలు సంపాదించి దర్శకుడిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని తపన పడే ఓ యువదర్శకుడిగా ఓ రోల్ లో నాని ట్రైలర్ లో కనిపించాడు. దశాబ్దాల క్రితం సమాజంలో వేళ్లూనుకునిపోయిన దేవదాసి వ్యవస్థలాంటి సాంఘిక దురాచారాల పైన పోరాడే శ్యామ్ సింగరాయ్ అనే పవరఫుల్ సోషల్ రీఫార్మర్ క్యారెక్టర్ లోనూ నాని డ్యూయల్ రోల్ కనిపించి అదరగొట్టేశాడు.