Selfie Video: రామకృష్ణ చనిపోయేముందు తీసుకున్న సెల్ఫీ వీడియో లో విస్తుపోయే విషయాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కుటుంబం తో సహా ఆత్మహత్యకు పాల్పడిన నాగ రామకృష్ణ సంఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ పై పోలీసులు కేసు నమోదు చేశారు.రామకృష్ణ చనిపోయేముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.