Self Watering Plants : మొక్కలకు నీళ్లు పోయడానికి బద్ధకమా? అయితే ఇలా చేయండి
ఆహ్లాదం కోసం ఇంటి ఆవరణలో మొక్కలు చాలా మంది పెంచుతుంటారు. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో వాటికి సమయానికి నీళ్లు పోయలేకపోతుంటారు. అదే మొక్కకు అవసరమైనప్పుడల్లా నీళ్లు వాటంతటవే కుండీలో పడితే ఎంత బాగుంటుందో కదా...! హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన గణేశ్... ఇలాంటి ఆవిష్కరణే చేశారు. మొక్క ఉండే కుండీ కింద ఓ నీళ్ల డబ్బాను ఏర్పాటు చేసి, అక్కడ సెన్సర్లు పెట్టారు. నీళ్లు అవసరమని సెన్సర్లు గుర్తించగానే ఆటోమేటిక్ గా నీళ్లు మొక్కలకు చేరుతాయి. దీనికి 500 రూపాయలు మాత్రమే ఖర్చయిందని గణేశ్ చెబుతున్నారు.