Saturn Enceladus : భూమి కాకుండా వేరే నివాసం కోసం వెతుకుతున్న మనిషి అన్వేషణ ఫలించిందా..?
Continues below advertisement
ఎంతో అందమైన విశ్వం మనది. ఈ భూమిపై ఉన్న వాతావరణం..అపారమైన ప్రకృతి సంపద మనిషిని ఇక్కడ సుఖంగా జీవించేందుకు దోహదం చేస్తున్నాయి. సుమారుగా 6మిలియన్ సంవత్సరాలుగా ఉంటే 60లక్షల సంవత్సరాలుగా మానవుడు..అతడి పూర్వీకులు భూమిపై జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇంకెన్నాళ్లు ఇక్కడే ఉంటాడనే అంశంపై స్పష్టమైన ఆధారాలు ఏవీ లేకపోయినా...ఇప్పుడు భూమి కేంద్రంగా జరుగుతున్న విధ్వంసం చూస్తే ఇక్కడ ఇంకెన్నాళ్లో ఉండలేమనే అంశం శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు కూడా వేయనీయటం లేదు. అందుకే సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ అనంతమైన ఈ విశ్వంలో భూమిలా అన్ని రకాలుగా తనకు సరిపోయే గ్రహం ఉందా అని అన్వేషణ సాగిస్తున్నాడు. ఆ వేటలో ఇప్పటికీ సరైన సమాధానం లభించకపోయినా....అనంతమైన విశ్వం వేదికగా మనిషి అన్వేషణ సాగుతూనే ఉంది.
Continues below advertisement