Sara Mafia: పోలీసులపైనే దాడికి దిగిన సారా వ్యాపారులు
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జిల్లెలపేట వద్ద ఈ నెల 27న పోలీసులపై సారా వ్యాపారులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. దాడికిి సంబంధించిన వీడియోలను పోలీసులు బయటపెట్టారు. గోదావరిలో పడవపై సారా తరలిస్తుండగా.... పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ శ్రీనివాసరావు తమ దగ్గర తరచుగా డబ్బులు తీసుకుంటాడని, అయినా ఎందుకు ఆపుతున్నారంటూ సారా వ్యాపారులు దాడికి దిగారు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.