Samantha: వచ్చే ఏడాది తన జీవితంలో పెద్దగా అంచనాలేవీ లేవన్న సమంత

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సమంత–నాగచైతన్య విడాకుల వ్యవహారం షాక్ కలిగించిన సంగతి తెలిసిందే. వారిద్దరి విడాకుల వ్యవహారంపై చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. కొందరు సమంతను టార్గెట్ చేసుకుని ట్రోల్స్ కూడా చేశారు. ఆ విషయంపై సమంత మరోసారి స్పందించింది. ‘ఫిల్మ్ కంపానియన్’ అనే సంస్థతో మాట్లాడుతూ నాటి సంగతులను గుర్తు చేసుకుంది.ఆ సమయంలో అభిమానుల ఫ్రస్ట్రేషన్ ను తాను అర్థం చేసుకోగలనని, కానీ, ట్రోల్స్ లా కాకుండా మరోలా వారి వారి అభిప్రాయాలను చెబితే బాగుండేదని వ్యాఖ్యానించింది. తన జీవితంలోని ప్రతి సంఘటననూ అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడతానని, ఒకరకంగా అది వారందరినీ తన జీవితంలోకి ఆహ్వానించడమే అవుతుందని చెప్పుకొచ్చింది. అభిమానులు ఆశించినట్టుగా తన నిర్ణయాలు, వ్యాఖ్యలు ఉండకపోవచ్చని, దాని వల్ల వారు అసంతృప్తికి గురై ఉండొచ్చని పేర్కొంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola