Samantha: కడపలో సమంత సందడి...భారీగా తరలివచ్చిన అభిమానులు
సినీతార సమంత కడప లో సందడి చేసింది. మాంగళ్య షాపింగ్ మాల్ ఏపీ లో తొలి బ్రాంచ్ ప్రారంభోత్సవానికి కడప నగరానికి వచ్చిన సమంత ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ లో 10 బ్రాంచ్ లు ఉన్నాయని ఇప్పుడు ఏపీ లో మొదటి బ్రాంచ్ కడప లో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని సినీతార సమంత తెలిపారు. తెలంగాణ లో ఒక బ్రాంచ్ తో మొదలుపెట్టి ఇప్పుడు 11 వ బ్రాంచ్ ప్రారంభించడం వ్యాపారంలో సక్సెస్ అవ్వడం చాలా అభినందనీయమన్నారు.