సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌

సల్మాన్‌ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. బాబా సిద్దిఖీ కన్నా దారుణంగా హత్య చేస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన వాడినని చెబుతూ మెసేజ్ పెట్టాడు. వెంటనే 5 కోట్లు ఇవ్వకపోతే చావు తప్పదంటూ బెదిరించాడు. బిష్ణోయ్‌తో ఎన్నో ఏళ్లుగా ఉన్న గొడవని  సెటిల్ చేసుకోవాలనుకుంటే.. అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మెసేజ్‌ని లైట్ తీసుకోవద్దని, తరవాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. ఈ మెసేజ్‌తో అలెర్ట్ అయిన ముంబయి పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే బాబా సిద్దిఖీ హత్య ముంబయిలో సంచలనం సృష్టించింది. ఇంకా గ్యాంగ్‌స్టర్ కల్చర్‌ పోలేదని రుజువు చేసింది. పైగా..బిష్ణోయ్ హిట్‌లిస్ట్‌లో సల్మాన్ పేరు ఎప్పటి నుంచో ఉంది. గతంలో సల్మాన్ ఇంటి ముందు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు. ప్రస్తుతం జైల్‌లో ఉన్న బిష్ణోయ్...అక్కడి నుంచే తన నెట్‌వర్క్‌ని నడిపిస్తున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola