హమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్

Continues below advertisement

అటు హమాస్‌తో, ఇటు హెజ్బుల్లాతో ఒకేసారి యుద్ధం చేస్తున్న ఇజ్రాయేల్ కీలక కమాండర్‌లను వరుస పెట్టి మట్టుబెడుతోంది. ఈ క్రమంలోనే మరో హమాస్ కీలక నేత యహ్య సిన్వర్‌ని మట్టుబెట్టినట్టు ప్రకటించింది. రఫాలో ఇజ్రాయేల్ సైన్యం దాడిలో సిన్వర్‌ చనిపోయినట్టు వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయేల్‌పై హమాస్ దాడి చేసింది. అప్పటి నుంచి ఈ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అయితే...ఆ దాడులను ప్లాన్ చేసింది యహ్యా సిన్వర్ అని తేల్చి చెబుతోంది ఇజ్రాయేల్. అందుకే...వెతికి మరీ చంపినట్టు స్పష్టం చేసింది. రఫాలో కొంత కాలంగా గగనతలం నుంచి దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయేల్. అంతకు ముందు హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియేని హతమార్చిన ఇజ్రాయేల్ సైన్యం..ఇప్పుడు సిన్వర్‌నీ చంపేసింది. 

ఈ విషయాన్ని ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా వెల్లడించారు. ఇది అంతం కాదని, హమాస్ అంతానికి ఆరంభమని తేల్చి చెప్పారు. హమాస్ ఉగ్రవాదులు 101 మంది శరణార్థులను బందీలుగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్ మిమ్మల్ని వెంటాడి చంపుతుంది అంటూ హమాస్‌కి వార్నింగ్ ఇచ్చారు. అయితే...సిన్వర్‌ చనిపోయే ముందు తన స్థావరంలో ఓ సోఫాపై కూర్చుని ఉన్న వీడియోని ఇజ్రాయేల్ సైన్యం విడుదల చేసింది. సిన్వర్ చివరి క్షణాలు ఇవే అంటూ పోస్ట్ పెట్టింది.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram