Sajjanar : అనాధలైన 20 మంది అమ్మలకు శ్రీసీతారామచంద్ర స్వామి దర్శనము కల్పించిన ఆర్టీసీ ఎం.డి
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వావివలస గ్రామం నుంచి పాలూరు సిద్దార్థ గత 717 రోజులుగా కొంతమంది దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఆయన సజ్జనార్ ని కలిసి అనాధలైన 20 మంది అమ్మలకు శ్రీసీతారామచంద్ర స్వామివారి దర్శనము కోసం సహాయం చేయాలనీ కోరగా, ప్రత్యేక చొరవ చూపి సజ్జనార్ తన సొంత ఖర్చులతో రామయ్య దర్శనం కల్పించారు.పాలూరి సిద్దార్థ ఆధ్వర్యంలో సుమారు 20 మంది అనాధ అమ్మలకు భద్రాచలం, పర్ణశాల ఆలయాల దర్శన యాత్రకు ప్రత్యేక బస్సును, అయ్యే ఖర్చులు,భోజన వసతి ఏర్పాటు చేసారు తెలంగాణ ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్. ఈ సందర్భంగా వారందరు సజ్జనార్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.