Sai Teja : లాన్స్ నాయక్ సాయి తేజ ఫోటోను ప్రేమగా ముద్దాడిన కుమారుడు మోక్షజ్ఞ
చిత్తూరు జిల్లా ఎగువరేగడలో లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బెంగుళూరులోని ఎలహెంక ఆర్మీ బేస్ నుంచి చిత్తూరు జిల్లాకు సాయి తేజ భౌతికకాయం చేరుకోగా....కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బిపిన్ రావత్ చాపర్ ప్రమాదంలో కన్నుమూసిన భద్రతాధికారి సాయి తేజ...వీరమరణాన్ని కీర్తిస్తూ గ్రామస్తులు జై జవాన్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరో వైపు సాయి తేజ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. ఇంకా ఊహ తెలియని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ సాయితేజ ఫోటోను ముద్దాడుతూ కనిపించటం పలువురిని కంటతడి పెట్టించింది.