RS Praveen Kumar: విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సర్వీసును త్యాగం చేశా
Continues below advertisement
హనుమకొండ లో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల తో ముఖ ముఖి నిర్వహించారు. ‘‘విద్యార్థుల జీవితాలు బాగుచేయడానికే నా ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశా.టీఆర్ఎస్ సర్కార్ ప్రైవేటు యూనివర్సిటీలకు మేలు చేస్తోంది. చెంచాగిరి చేసేందుకు నేను బీఎస్పీలో చేరలేదు, విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే చేరా.పేదలు చదవకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. పాలకులకు పేదలు చదువుకుంటే ప్రశ్నిస్తారని భయం.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వర్సీటీలకు 10వేల కోట్లు విడుదల చేయాలి. న్యాయం జరిగే వరకూ బీఎస్పీ నిద్రపోదు. బీఎస్పీని ప్రగతిభవన్‌కు పంపండి. బహుజన రాజ్యకోసం పోరాడుదాం. విద్యా, వైద్యం, స్వయం ఉపాధి కల్పించడమే బీఎస్పీ లక్ష్యం’’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Continues below advertisement