RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఫస్ట్ టైం చూసిన తర్వాత తారక్, రామ్ చరణ్ రియాక్షన్ చూడండి
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లను ముమ్మరం చేసిందీ చిత్రబృందం. రోజుకో రాష్ట్రం చొప్పున చుట్టేస్తూ హీరోలు, డైరెక్టర్ రాజమౌళి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. మరో వైపు ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియా బృందం...సినిమా యూనిట్ మెమరబుల్ మూమెంట్స్ ను అభిమానుల కోసం షేర్ చేస్తోంది. ట్రైలర్ కట్ అయిపోయిన తర్వాత తారక్, చరణ్ కోసం ప్రత్యేకంగా వేసి చూపించారు. అది కంప్లీట్ అయ్యేసరికి థియేటర్ లో రాజమౌళి అడుగుపెట్టారు. ఇక ఆనందంతో పరుగున వెళ్లిన చెర్రీ రాజమౌళిని గట్టిగా హగ్ చేసుకున్నారు. తారక్ ఏకంగా రాజమౌళిని ప్రేమగా ముద్దాడారు. ఆ తర్వాత మళ్లీ టీం అంతా కలిసి ట్రైలర్ చూసినట్లు వీడియోను విడుదల చేసింది చిత్రబృందం