Rohit Sharma : గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది! పరిమిత ఓవర్ల క్రికెట్ సారథిగా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతడి పిక్క కండరాలు పట్టేయడంతో టెస్టు సిరీసు మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ క్రికెటర్ ప్రియాంక్ పంచాల్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ట్వీటు చేసింది.