Ring Nets Issue: రింగు వలల వివాదంపై ప్రభుత్వం జోక్యం
కొన్ని రోజులుగా విశాఖ సాగరతీరంలో నెలకొన్న రింగు వలల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. జిల్లా కలెక్టరేట్ లో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రి కన్నబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి మత్స్యకారులతో చర్చలు జరిపారు. ఈ అంశంపై ఒక కమిటీ వేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 20లోగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సూచిస్తామని అప్పలరాజు హామీ ఇచ్చారు. ప్రస్తుతం మత్స్యకార గ్రామాల్లో ఉన్న కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామన్నారు.