Ring Nets Issue : విశాఖలో రోడ్డుపై బైఠాయించిన మత్స్యకారుల నిరసన
విశాఖలో రింగువలల వివాదం మరింత ఉద్ధృతంగా మారుతోంది. మొన్న అదుపులోకి తీసుకున్న మత్స్యకారులను విడుదల చేయాలనే డిమాండ్ తో....కలెక్టరేట్ కు వెళ్లేందుకు భారీఎత్తున మత్స్యకారులు సిద్ధమయ్యారు. పోలీసులు అప్రమత్తం అవటంతో...రోడ్డుపైనే కూర్చుని ఆందోళన నిర్వహిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.