Ration Distribution Vehicles: మొరాయిస్తున్న రేషన్ పంపిణీ వాహనాలు
ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న వాహనదారులకు అవస్థలు తప్పట్లేదు. చాలా చోట్ల వాహనాలు మొరాయిస్తున్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నందవరంలో వాహనం మరమ్మతులకు గురై ఆగిపోవడంతో.... దాన్ని అందరూ నెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమకు ఇచ్చే ఆర్థిక సాయం చాలట్లేదని, అధికారులు పట్టించుకోవట్లేదని వాహనదారులు వాపోతున్నారు.