Rameshbabu: అన్నయ్యను ఆఖరిసారి చూసుకునే అవకాశం మహేష్ బాబుకు దక్కుతుందా?
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రమేష్ బాబు పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోస్ లో ఉంచారు. కడసారి అతనికి నివాళులు అర్పించేందుకు టాలీవుడ్ ప్రముఖులు స్టూడియోకి చేరుకున్నారు. కానీ తన సోదరుడు మహేష్ బాబుకి ఇటీవలే కొవిడ్ పాజిటివ్ రాగా.. ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్యను కడసారి చూడకుండానే రమేష్ బాబు దహనసంస్కారాలు పూర్తయిపోతాయా అంటూ అభిమానులు బాధపడుతున్నారు.