Ramana deekshitulu : వంశపారంపర్య అర్చక వ్యవస్థకు టీటీడీ విఘాతం కలిగిస్తోంది
తిరుమల తిరుపతి దేవస్థానంలో వందల సంవత్సరాలుగా వస్తున్న వంశపారంపర్య, సంభావన అర్చక వ్యవస్థను... భ్రష్టు పట్టించేలా టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని ట్యాగ్ చేసిన రమణ దీక్షితులు... టిటిడిపై మళ్లీ న్యాయపోరాటం చేయాలా అని సలహా అడిగారు. రాష్ట్రప్రభుత్వం వంశపారంపర్య వ్యవస్థను కాపాడతామని చెబుతుంటే టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు..అందుకు విరుద్ధంగా ఉందంటూ రమణదీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రమణ దీక్షితులు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.