Ramakuppam Issue: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పూనుకున్న రెడ్డి సభ్యులు
చిత్తూరు జిల్లా రామకుప్పంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. నాలుగు మండలాల నుంచి రెడ్డి సంఘం కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా పోలీసులు కూడా అక్కడికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో రామకుప్పంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటులో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు నెలకొన్నాయి. అయినా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా... ఇప్పుడు అంబేడ్కర్ పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నించారు. ఎలాగైనా విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరతామంటూ రెడ్డి ప్రతినిధులు పేర్కొన్నారు.