Rajinikanth Birthday : సూపర్ స్టార్ రజినీకాంత్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
తలైవా...సూపర్ స్టార్ రజినీకాంత్ 72వ పుట్టినరోజును అభిమానులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. రజినీ స్టైలిష్, రెట్రో లుక్స్ తో పోస్టర్లు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ప్రధాని మోదీ నుంచి సీఎం స్టాలిన్ వరకూ ప్రతి ఒక్కరూ రజినీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.