Rajasthan Minister: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని మార్చాలంటూ రాజస్థాన్ మంత్రి చేసిన కామెంట్ వైరల్

Continues below advertisement

ఇటీవలే మంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న రాజేంద్ర సింగ్‌ గుడా ఝున్‌ఝును జిల్లాలోని తన నియోజకవర్గంలోని ఉడైపురవాటి ప్రాంతం ప్రజలతో సమావేశమయ్యారు. ఆయనతో తమ సమస్యల్ని విన్నవించుకుంటున్న జనం.. తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడే ఉన్న పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌తో 'నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలి' అని మంత్రి అన్నారు. దీంతో అక్కడి ప్రజల్లో కొందరు చప్పట్లు కొట్టారు. మరికొందరు నవ్వులు చిందించారు.అయితే, రాజకీయ నాయకులు రహదారులను సినీతారల బుగ్గలతో పోల్చడం ఇదే తొలిసారి కాదు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram