Chandrababu Naidu: పేదవాళ్ల రక్తం తాగే ప్రభుత్వం ఇది

వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబు నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. తాగుబోతుల డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాన్న తాగితే అమ్మకు అమ్మఒడి డబ్బులిస్తున్నారని మండిపడ్డారు. పేదవాళ్ల రక్తం తాగే ప్రభుత్వం ఇదని, జలగలాగా రక్తం పీల్చుతున్నారని అన్నారు. ఇది మంచి స్కీమే కదా, జగనన్న స్కీమ్ అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రికి సిగ్గులేదంటూ విమర్శించారు. తనని అసెంబ్లీలో కూడా తిడుతున్నారని, చివరకు తన కుటుంబ సభ్యుల పేర్లు కూడా వివాదాల్లోకి తెస్తున్నారని, తాను భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు బాబు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola