Rahul Sankrithyan: శ్యామ్ సింగరాయ్ సినిమాతో నా గ్రాడ్యుయేషన్ పూర్తైంది..అందుకే టక్ చేశా

Continues below advertisement

రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ...‘‘నాలోని పిరికితనాన్ని పాతరేసి నాకు ధైర్యం చెప్పిన గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అంటూ పాట రాసిన నాకు భయపడే హక్కు లేదు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అంటూ ఓ క్యారెక్టర్‌ను ప్రపంచానికి చెబుతున్న నీకు భయపడే అవసరం లేదు.. గుర్తు పెట్టుకో’ అని సీతారామశాస్త్రిగారు అన్నారు. వందకోట్ల బడ్జెట్‌ ఇవ్వలేని నమ్మకం నానిగారు ఇచ్చారు’’అన్నారు రాహుల్‌ సంకృత్యాన్‌.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram