Raghu Rama Krishnam Raju : తిరుపతి సభ తర్వాత మూడు రాజధానుల గురించే మాట్లాడేవారుండరు
రాజధాని అమరావతి శాశ్వతమని....అడ్డం పడేవారు అశాశ్వతమని అన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. రేణిగుంట విమానాశ్రయంలో మాట్లాడిన ఆయన...దామినేడులో జరిగేది దగాపడ్డ రైతుల సభ అని అన్నారు. సభలో అమరావతి రైతులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు పాల్గొంటున్నాయన్నారు. మహోద్యమ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారే ఉండరన్నారు. అమరావతి శాశ్వతమని...అడ్డంపడేవారిని వారు అశాశ్వతం అని అన్నారు.