Rafael Nadal on the cusp of History: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కు నాదల్

పురుషుల Tennisలో 21 Grandslams గెలిచిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించేందుకు Spain Bull Rafael Nadal అడుగు దూరంలో నిలిచాడు. అతడు ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరాడు. టైటిల్ పోరులో గెలిస్తే... 21 గ్రాండ్ స్లామ్స్ గెలిచిన తొలి పురుష ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తాడు. సెమీఫైనల్ లో ఇటలీకి చెందిన బెరెటినీపై 6-3,6-2,3-6,6-3 తేడాతో ఓడించాడు. సుమారు ఆరు నెలల పాటు గాయం వల్ల ఆటకు దూరమైన నాదల్... కొవిడ్ భయాల మధ్య ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడతాడో లేదో తొలుత సందిగ్ధం ఏర్పడింది. కానీ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసిన 35 ఏళ్ల నాదల్.... చరిత్ర సృష్టించేందుకు ఇంకొక్క గెలుపు దూరంలో నిలిచాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola