Rafael Nadal : ఇరవై ఒకటో గ్రాండ్ స్లామ్ లక్ష్యంపై మనసులో మాట చెప్పిన నాదల్
టెన్నిస్ చరిత్రలోనే 21 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన ఆటగాడిగా అందరికంటే ఎక్కువ అవకాశం ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన మనసులో మాట బయటపెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో ఈ సారి ఫెదరర్ పాల్గొనలేదు...మరో వైపు జకోవిచ్ ను వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో దేశంలోకి అనుమతించలేదు ఆస్ట్రేలియా అధికారులు. ఫలితంగా వాళ్లిద్దరినీ వెనక్కి నెట్టి 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకునే అవకాశం ఉన్న నాదల్...తన సంతోషం వాళ్లిద్దరినీ దాటే విషయంపై ఆధారపడి లేదని తేల్చేశాడు. ప్రస్తుతం జకోవిచ్, రోజర్ ఫెదరర్, నాదల్ ముగ్గురూ 20 గ్రాండ్ స్లామ్ విజయాలతో సమానంగా ఉన్నారు.