R Narayana Murthy: కేంద్ర వెంటనే బీసీ గణన చేపట్టాలని నారాయణమూర్తి డిమాండ్..!

బీసీ నాయకుడు బాయన శేఖర్ బాబు రచించిన జయహో బిసి పుస్తకావిష్కరణ విజయవాడలో జరిగింది. ఈ సభలో ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బీసీల బాధ్యతను గుర్తు చేసే విధంగా శేఖర్ బాబు ఈ పుస్తకాన్ని రచించారని తెలిపారు.. ప్రతి బిసి ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని ఆయన సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఉండగా హర్యానా 70శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించారని ఆయన వివరించారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కుల గణన నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతుల ఐక్యంగా ఉండి రిజర్వేషన్ల కోసం పోరాటం సాగించాలని నారాయణమూర్తి పిలుపునిచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola