Puttaparthi MLA: టీడీపీ బీఫాం మీద గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ మనిషి ఎలా అవుతాడు..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి టీడీపీ బీఫాం తో గెలిచిన వ్యక్తని...వైసీపీ కి సంబంధం లేదన్నారు పుట్టపర్తి ఎమ్మెల్యే. వైసీపీ బీఫాంపైన గెలిచిన ఎవరైనా చంద్రబాబు ను కించపరిచారా అని ప్రశ్నించిన శ్రీధర్ రెడ్డి....టీడీపీ ఎమ్మెల్యే...టీడీపీ అధ్యక్షుడిని అవమానిస్తే వైసీపీ కి ఏం సంబంధం అన్నారు.