AP PRC Issue: నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
Continues below advertisement
పీఆర్సీ విషయంలో ఏపీలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. నిన్న మొన్నటి వరకు నిరసనలతో సరిపెట్టిన ఉద్యోగులు... నేడు ప్రత్యక్ష కార్యచరణకు దిగారు. నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని టీచర్లు చుట్టుముట్టారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఓ దశలో కలెక్టరేట్ వద్ద నిరసనకు వచ్చిన ఉపాధ్యాయుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Continues below advertisement