Pulivendhula Flexis Issue: సీఎం నియోజకవర్గంలో పులివెందులలో ఫ్లెక్సీల వివాదం

సీఎం నియోజకవర్గంలో టీడీపీ నేతల ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. గతంలో, ప్రస్తుత నిత్యావసర వస్తువుల ధరల పట్టిక వేస్తూ పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు వేశారు. ఫ్లెక్సీలు వివాదాలకు దారి తీసే పరిస్థితి ఉందని పోలీసులు తొలగించాలని కోరగా...వాటిని టీడీపీ నేతలు తొలగించ లేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి వాటిని చించేశారు. ప్లెక్సీలను చించివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బిటెక్ రవి.. పోలీసులు, మున్సిపల్ అధికారులపై మీడియా సమావేశంలో మండిపడ్డారు.టీడీపీ తరపున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను చించి వేయడం దారుణం.ఫ్లెక్సీల ఏర్పాటుపై పోలీసులు, మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. వివేకా హత్యకేసులో ఉన్న వ్యక్తి ఫ్లెక్సీ లను పెడితే భరిస్తారన్న రవి....ప్రజలకు సంబంధించి ఫ్లెక్సీ లను పెడితే డ్యామేజీ వస్తుందా అని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola