President Kovind: కోవిడ్ 19 తో ఇంటి దగ్గరనుంచి పని చేయటం మహిళలకు అధికభారమన్న రాష్ట్రపతి|

మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. మలయాళ మనోరమ ఇయర్ బుక్ 2022 కోసం లేఖ రాసిన రాష్ట్రపతి అందులో కోవిడ్ 19 కష్టాలను పేర్కొన్నారు. మహిళలకు ఇంటినుంచి పనిచేయటం వల్ల అదనపు భారం పడుతోందని రాష్ట్రపతి అన్నారు. కంపెనీ కోసం ఉద్యోగం చేయటం మొదటి పనైతే...ఇంటి పనులు, బాధ్యతలు రెండో పని గా రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక పిల్లలు కూడా ఇంటి నుంచి ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతుండటంతో వారితో స్కూల్ బాధ్యతలన్నీ చూసుకోవటం మహిళలకు అదనపు బాధ్యతగా మారి మహిళలపై ట్రిపుల్ బర్డెన్ పడుతోందని వ్యాఖ్యానించారు రాష్ట్రపతి కోవింద్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola