Powerstar & Superstar : జనవరి 10వ తేదీని ఇద్దరి ఫ్యాన్స్ అస్సలు మర్చిపోరు
జనవరి 10.. ఈ తేదీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంత ఈజీగా మర్చిపోరేమో. ఎందుకంటే సాక్షాత్తూ గురూజీ త్రివిక్రమ్ తమ గుండెల్లో గుణపం దింపిన రోజని పవన్ ఫ్యాన్స్ అనుకుంటారు. సుక్కూ మ్యాజిక్ ను ఆనాడు అర్థం చేసుకోలేకపోయామే అని మహేశ్ అభిమానులు బాధపడుతుంటారు. ఎందుకంటే 2014 జనవరి 10న వన్ నేనొక్కడినే రిలీజ్ అయితే, 2018 జనవరి 10న అజ్ఞాతవాసి విడుదలైంది. సుక్కూ చాలా ఇంటెలిజెంట్ గా తెరకెక్కించిన వన్ సినిమాను అప్పుడు అర్థం చేసుకోలేకపోయిన అభిమానులు, ప్రేక్షకులు ఇప్పుడు దాన్ని కల్ట్ అంటున్నారు. అజ్ఞాతవాసి అనుభవం నుంచి మాత్రం పవన్ అభిమానులు అంత తేలికగా కోలుకోలేదు. ఆ రెండు సినిమాలు ఈ రోజే రిలీజ్ అవటంతో... ఆ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకెప్పుడూ జనవరి 10న సినిమాలు విడుదల చేయొద్దంటూ అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.