కశ్మీర్‌కి ఆర్టికల్ 370 మళ్లీ వస్తుందా, మోదీ ఉండగా సాధ్యమవుతందా?

మళ్లీ కశ్మీర్‌కి ఆర్టికల్ 370 తెప్పిస్తాం. స్వేచ్ఛ కల్పిస్తాం. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాల తరవాత ఒమర్ అబ్దుల్లా చేసిన ఈ కామెంట్స్‌ అప్పుడే పొలిటికల్ హీట్‌ని పెంచింది. ఆయన మాటల సారమంతా ఒక్కటే. ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చుకోవడం. అయితే..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..బీజేపీ నుంచి మాత్రం ఇది ఆశించడం లేదని చాలా క్లారిటీగా చెప్పారు ఒమర్ అబ్దుల్లా. ఎప్పుడో అప్పుడు ప్రభుత్వం మారకపోదా..అప్పుడు చూసుకుంటాం అనే వైఖరిలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే...ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ ఆ పని చేయదని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి..అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది బీజేపీ. పైగా ఆ పార్టీ అజెండాలోనూ ఆర్టికల్ 370 రద్దు చాలా కీలకమైంది. అలాంటప్పుడు బీజేపీ మళ్లీ ఆ స్పెషల్ స్టేటస్‌ని ఇస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కల్లో కూడా అనుకోదు. అందుకే...గవర్నమెంట్ మారిన తరవాతే ఆ కథ చూద్దాం అన్నారు ఒమర్ అబ్దుల్లా. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ప్రధాని మోదీ కశ్మీర్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే అంతా సర్వ నాశనం అవుతుందని కొందరు కామెంట్ చేశారని, కానీ ఇప్పుడు కశ్మీర్‌ లోయ అందంగా మారిపోయిందని చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola