PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్

Continues below advertisement

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని చెబుతున్న ప్రధానమంత్రి మోదీ వరుసగా వీడియోలు పెడుతున్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్యలు తీసుకుంటున్నట్టు ఓ వీడియో విడుదల చేశారు. ఇవాళ మరో సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. తన మొదటి వీడియోకు స్పందించి, సలహాలు సూచనలు చేసిన వారందరికీ థాంక్స్ చెప్పారు. మన బంధం చాలా బలంగా ఉంటుందని అన్నారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. యువత చూపిన ప్రేమ రెట్టింపు బలాన్ని ఇచ్చిందన్నారు. 

ప్రధాని మోదీ వీడియోలో ఇలా అన్నారు, "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. నేను పోస్ట్ చేసిన వీడియోకు మీరు స్పందించిన తీరు. మీరు ఇచ్చిన సానుకూల సూచనలు. అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన బంధం మరింత చురుకుగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. మిత్రులారా, ధన్యవాదాలు." ఆయన వీడియో క్యాప్షన్‌లో ఇలా కూడా రాశారు, "నిన్న నా వీడియో చూసి ఉపయోగకరమైన సూచనలు పంపిన యువతకు ధన్యవాదాలు."

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola