Perni Nani:సినీ సమస్యలపై ప్ర‌భుత్వం క‌మిటీ ..నివేదిక ఆధారంగా థియేట‌ర్ల‌లో టిక్కెట్ ధర‌లు

Continues below advertisement

‘‘థియేటర్‌ యజమానులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వారు తెలిసి మాట్లాడుతున్నారా? లేక తెలియక మాట్లాడతున్నారో అర్థం కావటం లేదు. ఈ ఏడాది సెప్టెంబరులో డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబ్యూటర్స్‌ అందరితోనూ సమావేశమయ్యాం. రాష్ట్రంలో కొన్ని థియేటర్లు ఎలాంటి అనుమతి లేకుండా నడుపుతున్నారు. సినిమా ప్రదర్శనకు రెవెన్యూ శాఖ నుంచి బీఫాం, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండాలని సూచించాం. అయినా కూడా ఇప్పటివరకూ థియేటర్ల యజమాన్యాలు రెన్యువల్‌ చేయించుకోలేదు. కనీసం లైసెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకోని వారిపై మాత్రమే చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన 130 థియేటర్‌లపై చర్యలు తీసుకున్నాం. జీవో నెం.35 ఏప్రిల్‌ 2021లో వచ్చింది. దానికి నిరసనగా ఇప్పుడు థియేటర్లు మూసివేయడం ఏంటో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాన‌ని మంత్రి అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram